కాసుల పంట పండించిన ఘాజి సినిమా
- April 19, 2017
రానా బాహుబలి1 సినిమా తర్వాత చేస్తోన్న సినిమాగానే కాదు.. దేశంలో తొలిసారి సబ్ మెరైన్ నేపద్యంతో తెరకెక్కుతున్న సినిమాగా వార్తల్లో నిలవడంతో అందరినీ ఆకర్షించింది.. ఓ కొత్త దర్శకుడు తీస్తున్నా ఈ సినిమా రిలీజ్ కోసం దేశం అంతా ఆసక్తిగా ఎదురుచూసింది. అంటే ఈ సినిమా కోసం ఎంచుకొన్న కాన్సెప్ట్.. ఎక్కువ భాగం ఓ సబ్ మెరైన్ లో ఉన్న ఈ సినిమా అంచనాలకు మించి విజయాన్ని అందుకొన్నది.. తెలుగు, తమిళ, హిందీ మూడు భాషల్లో రిలీజైన ఈ సినిమా అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినా ఫుల్ రన్ లో భారీ వసూళ్లను అందుకొన్నది. ఉత్తరాంధ్రా 1.55 కోట్లు, తూర్పు గోదావరి 0.65 కోట్లు, పశ్చిమ గోదావరి 0.45 కోట్లు, కృష్ణా గుంటూరు 0.75 కోట్లు, నెల్లూరు 0.30 కోట్లు నైజాం నుంచి 4.50 కోట్లు, సీడెడ్ నుంచి 0.80 కోట్లు వసూలు అయ్యాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 9.8 కోట్ల కలెక్షన్, తమిళనాడు లో 2.40 కోట్లు.. కర్నాటక నుంచి 2 కోట్లు.. రెస్టాఫ్ ఇండియా 10.25 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దీంతో మూడు భాషల్లో రిలీజైన ఘజి దేశ వ్యాప్తంగా 24.45 కోట్లు వసూలు చేసింది.. యూఎస్ లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకొన్న ఘజి 2 కోట్లను వసూలు చేసుకోగా.. రెస్టాఫ్ వరల్డ్ 0.65 కోట్లు వచ్చాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా లాంగ్ రన్ లో 27.1 కోట్లను వసూలు చేసింది.. బాహుబలి1 తర్వాత రానా చేసిన సినిమా అయినా ఓ కొత్త దర్శకుడు.. కొత్త నేపద్యం అయినా ఇన్ని కోట్లు వసూలు చేసింది అంటే రికార్డ్ అని చెప్పాలి.. పైగా సినిమా ను అతి తక్కువ ఖర్చుతో తెరకెక్కించడంతో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడమే కాదు.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది అని చెప్పవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!
- యానిమల్స్ పై క్రూరత్వానికి BD100,000 వరకు ఫైన్.. ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో హలాల్ సర్టిఫికెట్లపై కీలక నిబంధనలు..!!
- ఓపెన్ఏఐ ఏఐ ఏజెంట్ల నిర్వాకం.. ఆన్లైన్లో యూజర్ల ఫోటోలు..!!
- సౌదీలో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు ముమ్మరం..!!
- ఉద్యోగ మోసం ఆరోపణలు: కేరళలో సంస్థ యజమాని అదుపులోకి తీసుకున్నా.. సాధారణంగానే కార్యకలాపాలు
- న్యూయార్క్‌లో భారత్–జీసీసీ ట్రోయికా మంత్రుల సమావేశం
- హైదరాబాద్‌లో రాపిడో ఫుడ్ డెలివరీ.. ‘ఓన్లీ’ యాప్ ప్రారంభం
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి







