అమ్నెస్టీ ద్వారా 1 మిలియన్ వలసదారులకు లబ్ది
- April 19, 2017
ఇంకో 70 రోజుల్లో అమ్నెస్టీ గడువు పూర్తి కానుంది. మొత్తం 90 రోజుల అమ్నెస్టీ పీరియడ్‌ని వినియోగించుకుని, దేశం నుంచి 1 మిలియన్ ఉల్లంఘనులు, దేశం నుంచి బయటకు వెళ్ళే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఈ అంచనాల్ని వెల్లడించింది. అమ్నెస్టీకి మంచి స్పందన వస్తోందని అధికారులు చెబుతున్నారు. వివిధ కారణాలతో ఉల్లంఘనలకు పాల్పడ్డవారికి అమ్నెస్టీ ఓ వరంగా మారుతోంది. మార్చి 29న ఈ అమ్నెస్టీ క్యాంప్ ప్రారంభమయ్యింది. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అమ్నెస్టీకి సంబంధించిన అప్డేట్స్ని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ వివరిస్తోంది. 2013లో ఇచ్చిన అమ్నెస్టీని 3 మిలియన్ వలసదారులు వినియోగించుకున్నారు. అమ్నెస్టీ గడువుని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ నైఫ్ ఉల్లంఘనులకు సూచించారు. వివిధ సంస్థలు అమ్నెస్టీకి సంబంధించిన సమాచారానికి విస్తృత ప్రచారం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









