దుబాయ్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న గౌతమ్ నంద
- April 19, 2017
సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా 'గౌతమ్ నంద' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.రీసెంట్ గా ఈ సినిమా టీమ్ దుబాయ్ లో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసి, హైదరాబాద్ కి తిరిగొచ్చేసింది. దుబాయ్ లో కొన్ని సీన్స్ తో పాటు రెండు పాటలను షూట్ చేశారు.
గోపీచంద్ ఇంట్రడక్షన్ సాంగ్, నాయకా నాయికల మధ్య రొమాంటిక్ సాంగ్ ను అక్కడ తెరకెక్కించారు. రాజు సుందరం, దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించిన ఈ పాటలు చాలా బాగా వచ్చాయని సంపత్ నంది చెప్పాడు. తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నాడు. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు ఫిల్మ్ యూనీట్.
ఈ చిత్రానికి యు.ఏ.ఈ లో ఏ.కె.యస్ గ్లోబల్ మీడియా & ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత అశ్వని కుమార్ సహదేవ్, ప్రొడక్షన్ మేనేజర్స్ దుబాయ్ దేవా, నిఖిల్ సహాయ సహకారాలు అందించారు.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







