టాకీ పూర్తి చేసుకున్న 'కొత్త కుర్రోడు'
- April 19, 2017
నూతన దర్శకుడు మోహన్‌రావు తెరకెక్కిస్తున్న ‘కొత్త కుర్రోడు’ పాటలు మినహా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. శ్రీరామ్, శ్రీప్రియ, మహేంద్ర, ఆశ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన పాటల రికార్డింగ్ కార్యక్రమానికి తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన ‘నవతరాన్ని ప్రోత్సహిస్తూ ఈ యూనిట్ చేస్తున్న ప్రయత్నం అభినందనీయం.. పెద్ద విజయం అందుకోవాలి’ అని ఆకాక్షించారు. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘అంతా కొత్త కుర్రాళ్లతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. సినిమా చాలా బాగా వస్తోంది. పాటలు మినహా చిత్రీకరణ పూర్తైంది. త్వరలోనే పాటల్ని తెరకెక్కిస్తున్నాం’ అని చెప్పారు.సాయి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైట్‌ఆఫ్‌లవ్ క్రియేషన్స్ పతాకంపై లక్ష్మణ్ పదిలం నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







