తామర గింజల పాయసం
- April 19, 2017
కావలసినవి: తామర గింజలు - ఒక కప్పు, పాలు - అరలీటరు, నెయ్యి - ఒక టీస్పూన్, పంచదార - నాలుగు టేబుల్ స్పూన్లు, బాదం, జీడిపప్పుల పలుకులు - ఒక్కోటి టేబుల్ స్పూన్ చొప్పున, ఎండుద్రాక్షలు - 12, సార పప్పు - ఒక టీస్పూన్ (ఇష్టమైతేనే), యాలకల పొడి - అర టీస్పూన్, కుంకుమపువ్వు - చిటికెడు.
తయారీ: అరకప్పు తామర గింజల్ని సగానికి కోయాలి లేదా గ్రైండ్ చేయాలి. మిగతా సగాన్ని గింజలుగానే ఉంచాలి. పాన్‌లో నెయ్యి వేడిచేసి బాదం, జీడిపప్పుల్ని వేగించాలి. తరువాత అందులోనే ఎండుద్రాక్షలు వేసి అవి ఉబ్బే వరకు వేగించి పక్కన పెట్టాలి. అదే పాన్‌లో తామర గింజల్ని వేసి లేత గోధుమరంగుకి వచ్చి కరకరలాడుతున్నట్టు వచ్చే వరకు గరిటెతో కలుపుతూ వేగించాలి. తరువాత వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. మరో పాన్‌లో పాలు పోసి వేడిచేయాలి. వేడెక్కాక స్టవ్ మంటను తగ్గించి పాల మోతాదు తగ్గేవరకు ఉంచాలి. ఆ తరువాత వేగించిన తామర గింజలు వేసి సన్నటి మంట మీద ఐదు నిమిషాలు ఉంచాలి. మధ్యమధ్యలో గరిటెతో కలుపుతుండాలి. పాయసం చిక్కబడుతుండగా పంచదార వేసి ఓ నిమిషం ఉడికించాలి. అందులో యాలకలపొడి, కుంకుమపువ్వు, వేగించిన బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షల్లో సగాన్ని వేసి బాగా కలిపి మంట తగ్గించాలి. మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. వేడిగా లేదా చల్లగా ఎలా తిన్నా రుచిగానే ఉంటుంది. కాకపోతే తినేముందు పైన బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షలతో అలంకరించాలి. పాయసం చిక్కగా కావాలనుకుంటే మూడు టేబుల్ స్పూన్ల కండెన్స్‌డ్ మిల్క్ కలుపుకోవచ్చు. తీపి ఎక్కువ కావాలనుకుంటే మరికొంచెం పంచదార కలుపుకోవచ్చు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







