ముమ్మరంగా మోదీ విదేశీ పర్యటనలు మే 12 నుంచి

- April 19, 2017 , by Maagulf
ముమ్మరంగా మోదీ విదేశీ పర్యటనలు మే 12 నుంచి

వచ్చే నెల నుంచీ జులై వరకూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముమ్మరంగా విదేశీపర్యటనలు జరపనున్నారు. శ్రీలంకతో ఆయన పర్యటనల షెడ్యూలు మొదలౌతుంది. తర్వాత అమెరికా, ఇజ్రాయెల్‌, రష్యా, జర్మనీ, స్పెయిన్‌, కజికిస్థాన్‌లలో మోదీ పర్యటిస్తారని అధికారులు బుధవారం నాడిక్కడ వెల్లడించారు. .
* మేనెల 12 నుంచీ 14వ తేదీ వరకూ మోదీ శ్రీలంకలో పర్యటిస్తారు. అక్కడ జరిగే ఐరాస వేసక్‌ దినోత్సవాల్లో.. అంతర్జాతీయ బౌద్ధ సమ్మేళనంలో పాల్గొంటారు. 
* జూన్‌ 1 నుంచీ 3వ తేదీ వరకూ మోదీ రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో పర్యటిస్తారు. అక్కడ నిర్వహించనున్న సెయింట్‌పీటర్స్‌బర్గ్‌ అంతర్జాతీయ ఆర్థిక వేదిక సమావేశాల్లో పాల్గొంటారు. 
* జూన్‌ 7-8 తేదీల్లో కజిగిస్థాన్‌లో జరిగే ‘షాంఘై సహకార సంస్థ’ సమావేశానికి హాజరౌతారు. ఈ సమావేశానికి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కూడా హాజరు కావచ్చని భావిస్తున్నారు. 
* తర్వాత...అంటే జులై 7-8 తేదీల్లో జర్మనీలోని హాంబర్గ్‌లో జరగాల్సి ఉన్న జి-20 శిఖరాగ్ర సదస్సుకు మోదీ హాజరౌతారు. 
* ఇక, అమెరికా, ఇజ్రాయెల్‌లలో ప్రధాని పర్యటనకు సంబంధించి తేదీలు ఖరారు దశలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com