ముమ్మరంగా మోదీ విదేశీ పర్యటనలు మే 12 నుంచి
- April 19, 2017
వచ్చే నెల నుంచీ జులై వరకూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముమ్మరంగా విదేశీపర్యటనలు జరపనున్నారు. శ్రీలంకతో ఆయన పర్యటనల షెడ్యూలు మొదలౌతుంది. తర్వాత అమెరికా, ఇజ్రాయెల్, రష్యా, జర్మనీ, స్పెయిన్, కజికిస్థాన్‌లలో మోదీ పర్యటిస్తారని అధికారులు బుధవారం నాడిక్కడ వెల్లడించారు. .
* మేనెల 12 నుంచీ 14వ తేదీ వరకూ మోదీ శ్రీలంకలో పర్యటిస్తారు. అక్కడ జరిగే ఐరాస వేసక్ దినోత్సవాల్లో.. అంతర్జాతీయ బౌద్ధ సమ్మేళనంలో పాల్గొంటారు.
* జూన్ 1 నుంచీ 3వ తేదీ వరకూ మోదీ రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో పర్యటిస్తారు. అక్కడ నిర్వహించనున్న సెయింట్‌పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక సమావేశాల్లో పాల్గొంటారు.
* జూన్ 7-8 తేదీల్లో కజిగిస్థాన్లో జరిగే ‘షాంఘై సహకార సంస్థ’ సమావేశానికి హాజరౌతారు. ఈ సమావేశానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్కూడా హాజరు కావచ్చని భావిస్తున్నారు.
* తర్వాత...అంటే జులై 7-8 తేదీల్లో జర్మనీలోని హాంబర్గ్‌లో జరగాల్సి ఉన్న జి-20 శిఖరాగ్ర సదస్సుకు మోదీ హాజరౌతారు.
* ఇక, అమెరికా, ఇజ్రాయెల్‌లలో ప్రధాని పర్యటనకు సంబంధించి తేదీలు ఖరారు దశలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అబుదాబిలో బాల్కనీలు, రూఫ్‌టాప్‌లపై వస్తువులు పెడితే భారీ జరిమానా
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..







