మాల్ ఆఫ్ ఖతార్ వద్ద సిగ్నలైజ్డ్ ఇంటర్‌సెక్షన్
- April 19, 2017
రయాన్‌లో మాల్ ఆఫ్ ఖతార్ వద్ద ప్రస్తుతం ఉన్న తాత్కాలిక రౌండెబౌట్ శనివారం నుంచి సిగ్నలైజ్డ్ ఇంటర్‌సెక్షన్‌గా మారనుందని అష్గల్ బుధవారం ప్రకటించింది. అష్గల్ - దుకాన్ హైవేని కనెక్ట్ చేసే టెంపరరీ రోడ్‌ని మూసివేయనుంది. ఉమ్ అల్ అఫాయ్ పెట్రోల్ స్టేషన్ నుంచి దోహా వైపు వెళ్ళే ట్రాఫిక్ మాల్ ఆఫ్ ఖతార్ మరియు అల్ రయ్యాన్ స్పోర్ట్స్ క్లబ్ రోడ్‌ని వినియోగించుకోవచ్చు. సెలబ్రేషన్ రోడ్‌ని చేరుకుని, ఎమిరి గార్డ్ రౌండెబౌట్‌ని రీచ్ అవ్వొచ్చు. దోహా నుంచి ఉమ్ అల్ అఫాయ్ పెట్రోల్ స్టేషన్ వైపు వచ్చే ట్రాఫిక్, మాల్ ఆఫ్ ఖతార్ వెళ్ళే లేన్‌ని ఉపయోగించుకుని, కొత్త ఇంటర్‌సెక్షన్ వైపుగా వెళ్ళే లేన్‌లోకి మళ్ళవచ్చు. సెలబ్రేషన్ నుంచి వచ్చేవారు, మాల్ ఆఫ్ ఖతార్ అల్ రయ్యాన్ స్పోర్ట్స్ క్లబ్ ద్వారా కొత్త ఇంటర్‌సెక్షన్‌ని చేరుకోవచ్చు. ఉమ్ అల్ అఫాయ్ పెట్రోల్ స్టేషన్ వైపుగా వెళ్ళొచ్చు. మాల్ ఆఫ్ ఖతార్, అల్ అయాన్ స్పోర్ట్స్ క్లబ్ వైపు వెళ్ళే రోడ్లకు ట్రాఫిక్ సైన్స్ ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి మ్యాప్‌లను కూడా విడుదల చేశారు. రోడ్ యూజర్స్ స్పీడ్ లిమిట్స్‌ని పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరి అరెస్ట్..!!
- సౌదీలో వాహనాల నంబర్ ప్లేట్లపై కీలక హెచ్చరిక..!!
- యూఏఈ నేషనల్ డే.. విమాన టికెట్ల ధరలు రెట్టింపు..!!
- ఖతార్‌లో ప్రైవేట్ రంగంలో జాతీయీకరణకు ప్రణాళిక..!!
- ఒమన్‌లో 31 మంది ఆసియా జాతీయులు అరెస్ట్..!!
- బహ్రెయిన్‌లో విదేశీ కార్మిక నిబంధనలు మరింత సులభతరం..!!
- మన కళలు,సంస్కృతికి నిదర్శనం విజయవాడ ఉత్సవ్: మంత్రి కందుల దుర్గేష్
- అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు!
- ముదిరిన SIR వివాదం ..CEC రాజీనామాకు ఖర్గే డిమాండ్
- అబుదాబిలో బాల్కనీలు, రూఫ్‌టాప్‌లపై వస్తువులు పెడితే భారీ జరిమానా







