దుబాయ్ పోలీస్ చేతికి బీచ్ బగ్గీస్
- April 20, 2017
దుబాయ్: బీచ్‌లలో ఇకపై బీచ్ బగ్గీస్ కనిపిస్తాయి. దుబాయ్ పోలీసులు తమ పెట్రోల్ ఫ్లీట్లోకి బీచ్ బగ్గీస్ని తీసుకొచ్చారు. టజూూరిస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్, తమ తొలి క్వాడ్ బైక్ పెట్రోల్ యూనిట్‌ని ప్రకటించింది. ఈ వాహనాన్ని తెలుపు రంగులో, ఫారెస్ట్ గ్రీన్ కాంబినేషన్లో రూపొందించారు. టూరిస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ ముబారక్ సయీద్ సలీమ్ బిన్ నవ్వాస్ మాట్లాడుతూ, అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించేందుకు, బీచ్‌లో టూరిస్టుల భద్రత కోసం వీటిని వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఈ కొత్త పోలీస్ పెట్రోల్స్ టూరిస్టులకు సంబంధించిన వస్తువులకు కూడా భద్రతనిస్తాయి. ఒక చోట నుంచి ఇంకో చోటకి తమ వస్తువుల్ని తరలించడానికి వీటిని ఉపయోగించవచ్చు. బీచ్ పెట్రోల్స్లో ఫస్ట్ ఎయిడ్ కిట్స్, రెండు అదనపు కుర్చీలు, టూరిస్టుల లగేజ్‌ని తరలించేందుకు తగినంత పేస్ ఉంటాయని లెఫ్టినెంట్ కల్నల్ బిన్ నవ్వాస్ చెప్పారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







