క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్న 10 మంది భారతీయులు

- April 20, 2017 , by Maagulf
క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్న 10 మంది భారతీయులు

అబుధాబి: అల్‌ అయిన్‌ జైలులో మగ్గుతున్న పది మంది భారతీయ యువ కార్మికులు, క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో వీరి క్షమాభిక్షపై ఓ స్పష్టత రానుంది. అల్‌ అయిన్‌ అపీల్స్‌ కోర్ట్‌, బుధవారం ఈ కేసులో విచారణను పూర్తి చేసింది. మే 25వ తేదీకి తీర్పుని వాయిదా వేసింది. 2015లో ఓ పాకిస్తానీ వ్యక్తి హత్యకు సంబంధించి పది మంది భారతీయు యువకులపై అభియోగాలు మోపబడ్డాయి. మృతుడి కుటుంబీకులు, నిందితులకు క్షమాభిక్ష ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇంకో వైపున బ్లడ్‌ మనీ చెల్లించేందుకు దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త ఎస్‌పిఎస్‌ ఒబెరాయ్‌ ముందుకొచ్చారు. ఇప్పటిదాకా ఒబెరాయ్‌ 78 మందికి ఇదే విధంగా బ్లడ్‌ మనీని చెల్లించి వారిని మరణ శిక్ష నుంచి తప్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com