భారీ ధర పలికిన మహాత్మాగాంధీ స్టాంప్

- April 20, 2017 , by Maagulf
భారీ ధర పలికిన మహాత్మాగాంధీ స్టాంప్

బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గాంధీకి యూకేలో ఇంత ధర పలకటం పట్ల అంతా ఆశ్చర్యపోతున్నారు. ఓ భారత స్టాంప్‌కు ఇంత ధర పలకడం కూడా ఇదే తొలిసారి. 1948 నాటి పది రూపాయల విలువ గల మహాత్ముడి స్టాంపులు కేవలం 13 మాత్రమే చలామణిలో ఉన్నట్లు వేలం నిర్వాహకులు చెప్పారు. ఇందులో నాలుగింటిని ఇప్పుడు వేలం వేయగా.. మరో నాలుగు రాయల్‌ ఫిలాటెలిక్‌ కలెక్షన్‌ హౌస్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ కలెక్షన్‌ హౌస్‌ బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2కు చెందినది.

జాతిపిత మహాత్మాగాంధీ చిత్రంతో ఉన్న అరుదైన స్టాంపులను  బ్రిటన్‌లో వేలం వేశారు. వేలంలో అవి రికార్డు ధర పలికాయి. యూకేలోని స్టాన్లీ గిబ్బన్స్‌ అనే స్టాంప్‌ కలెక్టింగ్‌ కంపెనీ గాంధీ  బొమ్మతో ఉన్న నాలుగు స్టాంపులను వేలం వేసింది. రికార్డు స్థాయిలో అవి 5లక్షల పౌండ్లు పలికాయి. భారత కరెన్సీలో అయితే అది  4 కోట్లు. వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి వీటిని దక్కించుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com