లవర్ కోసం విమానం హైజాక్ చేస్తానంటూ డ్రామా!
- April 20, 2017
విమానాలను హైజాక్ చేస్తానంటూ ముంబై పోలీసులకు ఈ-మెయిల్ చేసిన యువకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ అమీర్ పేటకు చెందిన ట్రావెల్ ఏజంట్ వంశీ ఈ నిర్వాకానికి పాల్పడ్డాడని గుర్తించారు. ఎస్సార్ నగర్ లో ఇతడిని అదుపులోకి తీసుకుని ఐటీ చట్టంలోని రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. తన ప్రియురాలి అలక తీర్చడానికి ఇతగాడు ఆడిన నాటకం వారిని ఆశ్చర్యపరిచింది. విమానాలను హైజాక్ చేస్తానంటూ ఈ నెల 16 న ముంబై పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు సమాచారం అందింది. దీంతో అధికారులు ముంబై, చెన్నై, హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి హై అలర్ట్ ప్రకటించారు.
ఓ మహిళ ఆరుగురు యువకులతో కలిసి విమానాలను హైజాక్ చేసే అవకాశం ఉందన్నదే ఆ ఈ-మెయిల్ సారాంశం. ముంబై ఖాకీల దర్యాప్తులో ఈ-మెయిల్ హైదరాబాద్ నుంచి వచ్చిందని తెలిసి సిటీ పోలీసుల సాయం కోరారు. వారి అభ్యర్ధనపై టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి చివరకు నిందితుడిని పట్టుకున్నారు. చెన్నైలో ఉంటున్న వంశీ ప్రియురాలు.. ఈ సమ్మర్ లో ముంబై, గోవా వంటి ప్రాంతాలకు సరదాగా హాలిడే ట్రిప్ వేద్దామని అతడ్నికోరిందని, అయితే తన దగ్గర డబ్బుల్లేవని వంశీ చెప్పినా ఆమె వినిపించుకోకపోవడంతో, విమానాల హైజాక్ బెదిరింపులు చేస్తే టూర్ రద్దవుతుందన్న ఆలోచనతో వంశీ ఈ పథకం పన్నాడని తెలిసింది.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







