భారీ ధర పలికిన మహాత్మాగాంధీ స్టాంప్
- April 20, 2017
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గాంధీకి యూకేలో ఇంత ధర పలకటం పట్ల అంతా ఆశ్చర్యపోతున్నారు. ఓ భారత స్టాంప్‌కు ఇంత ధర పలకడం కూడా ఇదే తొలిసారి. 1948 నాటి పది రూపాయల విలువ గల మహాత్ముడి స్టాంపులు కేవలం 13 మాత్రమే చలామణిలో ఉన్నట్లు వేలం నిర్వాహకులు చెప్పారు. ఇందులో నాలుగింటిని ఇప్పుడు వేలం వేయగా.. మరో నాలుగు రాయల్ ఫిలాటెలిక్ కలెక్షన్ హౌస్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ కలెక్షన్ హౌస్ బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు చెందినది.
జాతిపిత మహాత్మాగాంధీ చిత్రంతో ఉన్న అరుదైన స్టాంపులను బ్రిటన్‌లో వేలం వేశారు. వేలంలో అవి రికార్డు ధర పలికాయి. యూకేలోని స్టాన్లీ గిబ్బన్స్ అనే స్టాంప్ కలెక్టింగ్ కంపెనీ గాంధీ బొమ్మతో ఉన్న నాలుగు స్టాంపులను వేలం వేసింది. రికార్డు స్థాయిలో అవి 5లక్షల పౌండ్లు పలికాయి. భారత కరెన్సీలో అయితే అది 4 కోట్లు. వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి వీటిని దక్కించుకున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







