ఉమ్మ్ సాలైల కొత్త చేపల మార్కెట్ లో సౌకర్యాలను కోరుతున్న విక్రేతలు
- April 20, 2017
సౌకర్యవంతంగా ఉమ్మ్ సాలైలో ఏర్పాటు చేయబడిన కొత్త చేపల మార్కెట్ కు పలువురు చేపల పెంపకందారులు తమ చేపలను ఇక్కడ తాము ఎంచుకొన్న విక్రేతలకు అమ్ముకునేందుకు 30 కిలోమీటర్ల దూరం నుండి ఇక్కడకు వస్తున్నారు. అయితే వినియోగదారుల ఇక్కడ నెలకొని ఉన్న తాజా చేపల పోటీ ధరలను చూసి ఆశ్చర్యపోతున్నారు.ద్వీపకల్పంలో ఉదహరించిన విధంగా అనేకమంది వినియోగదారులు గతంలో ఉండే అబూ హమౌర్ వద్ద ఉన్నకేంద్ర మార్కెట్ ను గుర్తు చేసుకొంటున్నారు. ప్రస్తుతం ప్రత్యేమ్నాయంగా వేరే మార్కెట్ లేకపోవడంతో ఎటువంటి ఎంపికను చేసుకోలేకపోతున్నారు. కొత్త చేపల మార్కెట్ లో వ్యాపారం రోజువారీగా సగటున 2000 కతర్ రియాళ్ళకు మించి అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో విక్రయదారులు ఇప్పటికీ తమ వ్యాపారం గురించి ఆందోళన చెందుతున్నారు, ఎందుకంటే వారు ఊహించిన విధంగా కొత్త సౌకర్యంతో నడుస్తోంది. పాత విక్రయాలలో తమ వ్యాపారం ఏ విధంగా సాగేదో జ్ఞాపకం చేసుకొంటున్నారు. పాత మార్కెట్ లో అమ్మకాలు రోజుకు కనీసం 7,000 కతర్ రియాళ్ళను కాళ్ళ చూసేవారమని , ఇక వారాంతాలలో తమ వ్యాపారం 10,000 కతర్ రియాళ్ళను చేరుకొనేదని వాపోతున్నారు. ఉమ్మ్ సాలైల కొత్త చేపల మార్కెట్ లో సౌకర్యం గురించి ఎక్కువమంది వినియోగదారులు తెలుసుకొంటే, యధాతధంగా తమ డిమాండ్ పెరుగుతుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. క్రొత్త సదుపాయంతో ఏర్పడిన ఈ మార్కెట్ కు గృహ సదుపాయం లేని కారణంగా కొందరు విక్రేతలు తమ వసతి మరియు ఆహారం గురించి ఆందోళనచెందుతున్నారు. అతధికులు దోహా తదితర ప్రాంతాల నుంచి మార్కెట్ కు రావడానికి విక్రేతలు ఎక్కువ ప్రయాణ ఖర్చులు చేయాల్సివస్తుంది. పోనే వెలుపల నుంచి పార్సిల్ భోజనం రప్పించుకొందామా అంటే మార్కెట్ సమీపంలో ప్రస్తుతం సరైన రెస్టారెంట్ లేదు.ఈ కొత్త మార్కెట్లో పండ్లు మరియు కూరగాయలు, కోడి మాంసం విక్రయించే దుకాణాలు మరియు తాజా మాంసం కోసం కబేళా వంటి ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి, ఇది తోటల పెంపకానికి అలంకరణా మొక్కలు మరియు ఇతర పరికరాలు మరియు ఎరువులు అందించే ఒక నర్సరీ కూడా ఇక్కడ ఉంది.వధ్యశాల ఇంకా తెరిచి ఉండకపోవడం లేదు మరియు చికెన్ దుకాణాలు కొన్ని సాంకేతిక సమస్యలు కారణంగా నేరుగా కోళ్లు నిలబెట్టడానికి అనుమతించబడవు, దీనితో విక్రేతలు శీతలీకరించిన చికెన్ విక్రయిస్తున్నారు. దీనితో ఇక్కడ తక్కువ అమ్మకాలు జరుగుతున్నాయి. కానీ అమ్మకందారులు సమీప భవిష్యత్తులో తాజా కోడి మాంస అమ్మకాలు మొదలయితే తమ వ్యాపారం పుంజుకొంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్కెట్ లో చేపల ధరలు చాలా తక్కువగా ఉంటున్నాయి. సఫీ చేపల వంటివి కిలోగ్రాముల ధర 12 కతర్ రియాళ్ళకు అందుబాటులో ఉంది. పండ్లు మరియు కూరగాయల ధరల వ్యత్యాసం ఇతర మార్కెట్లతో సరిపోల్చితే ఇక్కడ అధిక రేట్లు ఏమీ లేవు.
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







