ఒమనీ బాధితుడి కోసం మెర్సీ ఫ్లైట్‌

- April 21, 2017 , by Maagulf
ఒమనీ బాధితుడి కోసం మెర్సీ ఫ్లైట్‌

చైనాలో అనారోగ్యంతో బాధపడుతున్న ఒమన్‌కి చెందిన వ్యక్తిని స్వదేశానికి తీసుకొచ్చేందుకోసం రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ప్రత్యేక విమానాన్ని పంపింది. బాధితుడికి చైనాలో సర్జరీ జరుగగా దురదృష్టవశాత్తూ శస్త్ర చికిత్స వికటించి, కోమాలోకి వెళ్ళిపోయాడు. కమర్షియల్‌ విమానాల్లో వచ్చేందుకు ఆరోగ్యం సహకరించకపోవడంతో కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ఒమన్‌ ప్రభుత్వం ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించింది. పౌరుల పట్ల సుల్తాన్‌ బిన్‌ కబూస్‌ బిన్‌ సైద్‌ చూపించే దయ నేపథ్యంలో రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ప్రత్యేక విమానాన్ని చైనాకి పంపించింది. విమానం శనివారం ఒమన్‌కి చేరుకునే అవకాశం ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com