బ్రిటన్ రాణి పుట్టినరోజు వేడుకలు నిరాడంబరంగా
- April 22, 2017
బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 తన 91వ పుట్టినరోజును శుక్రవారం ఎలాంటి ఆర్భాటం లేకుండా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె అధికార నివాసం బకింగ్‌హాం ప్యాలెస్ 1926 మే నాటి 10 రోజుల చిన్నారి ఎలిజబెత్ ఫొటోను విడుదల చేసింది. ఆమెకు నామకరణం చేస్తున్నపుడు తీసిన ఈ నలుపు, తెలుపు ఫొటోలో ఎలిజబెత్ తన తల్లిదండ్రుల చేతుల్లో కనినిస్తున్నారు.
వేల్స్ రాజకుమారుడు క్లారెన్స్ హౌస్, ఆయన భార్య కామిల్లా 1952 నాటి యువకురాలైన రాణి, ఆమె భర్త ప్రిన్స్ చార్లెస్‌కు చెందిన మరో ఫొటోను ట్వీటర్‌లో పంచుకున్నారు. రాణికి గౌరవ సూచకంగా హైడ్ పార్క్‌లో 41 తుపాకులతో, టవర్ ఆఫ్ లండన్‌లో 62 తుపాకులతో, విండ్సార్ క్యాపిటల్‌లో 21 తుపాకులతో సైనికులు గాల్లోకి కాల్పులు జరిపారు.
థాయ్‌లాండ్ రాజు భూమిబల్ మరణంతో, సుదీర్ఘకారం రాచరిక విధుల్లో కొనసాగుతున్న, అత్యంత వయస్కురాలైన పరిపాలకురాలిగా ఎలిజబెత్ ఖ్యాతి గడించారు. 1926, ఏప్రిల్ 21న అప్పటి యార్క్ యువరాజు, యువరాణికి ఎలిజబెత్ తొలి సంతానంగా జన్మించారు. 1952, ఫిబ్రవరి 6న బ్రిటన్‌కు రాణి అయిన ఎలిజబెత్ ఈ ఏడాది అదే రోజుకి ఈ పదవిలో 65 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి బ్రిటన్ పరిపాలకురాలు ఈమెనే కావడం విశేషం. అయితే రాణి తన అధికారిక పుట్టిన రోజును మాత్రం జూన్ 17న జరుపుకుంటారు. ఈ సందర్భంగా యూకే వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









