రోడ్లపై నిఘా నేత్రం: 'తాలా' కెమెరా

- October 03, 2015 , by Maagulf
రోడ్లపై నిఘా నేత్రం: 'తాలా' కెమెరా

నేషనల్‌ కమాండ్‌ సెంటర్‌, సెంట్రల్‌ ఆపరేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌, జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌ అండ్‌ జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ (సెక్యూరిటీ సిస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌) సంయుక్తంగా 'తాలా' అనే ప్రాజెక్ట్‌ చేపట్టింది. రోడ్లపై అతి వేగంతో ప్రయాణించేవారు, వివిధ రకాలైన ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించేందుకు, రోడ్‌ సేఫ్టీపై అవగాహన కల్పించేందుకు, రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ఈ ప్రాజెక్ట్‌ ఉద్దేశింపబడింది. ప్రతి 200 మీటర్లకు ఓ కెమెరాను ఏర్పాటు చేసి, రోడ్లపై వాహనాల్ని క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఇప్పటికే పని ప్రారంభించగా, సుమారు 23 వేల ట్రాఫిక్‌ అతిక్రమణల నమోదయ్యాయి. డ్రైవింగ్‌ చేస్తూ మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడటం, మొబైల్‌ పోన్‌లో ఎస్‌ఎంఎస్‌లు పంపించడం, మితి మీరిన వేగంతో ప్రయాణించడం, రాంగ్‌ ఓవర్‌టేకింగ్‌, సీట్‌ బెల్ట్‌ లేకుండా ప్రయాణించడం వంటి ట్రాఫిక్‌ అతిక్రమణల్ని ఈ కెమెరాలు గుర్తిస్తాయి. వాహనం ఎంత వేగంగా వెళుతున్నా, కమాండ్‌ కంట్రోల్‌ పాయింట్‌ నుంచి ఆ వాహనాన్ని గుర్తించడం, జూమింగ్‌లో వాహనం, వాహనం నడుపుతున్నవారి వివరాల్ని సేకరించగలగడం ఈ కెమెరాల ప్రత్యేకతగా అధికారులు చెప్పారు. 

 

--వి. రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com