దుబా నౌకాశ్రయంలో 4 మిలియన్ల మాదక ద్రవ్య మాత్రలు స్వాధీనం
- April 22, 2017
జెడ్డా:ఉల్లిపాయల ఘాటుకు కస్టమ్ అధికారులు ఆ ఛాయలలో శోధించరని బహుశా స్మగ్లర్లు భావించేవారేమో ఉల్లిపాయ సరకు రవాణాలో వేలాది మాధకద్రవ్యాల మాత్రలను దాచి పడవ ద్వారా అక్రమంగా రవాణా చేయబోయి నిఘా ధికారులకు అడ్డంగా దొరికిపోయారు. సౌదీ అధికారవర్గాలు తెలిపిన వివరాలాఖ్ ప్రకారం దుబాయ్ వాయువ్య నౌకాశ్రయం ద్వారా వచ్చే ఒక పెద్ద పడవలో అనేక సరుకుల మధ్య దాచిపెట్టిన 4 మిలియన్ కంటే ఎక్కువగా ఉన్న నార్కోటిక్ మాత్రలు స్వాధీనం చేసుకున్నారు
దుబా పోర్ట్ కస్టమ్స్ డైరెక్టర్ అలీ అల్-ఓటువీ ఒక పడవలో ఒక ట్రక్కులో ఉల్లిపాయ సరకు రవాణాలో 1 మిలియన్ కంటే ఎక్కువ కాప్టన్ టాబ్లెట్లను కనుగొన్నారు. ఉల్లిపాయ సంచుల మధ్యలో మాత్రలు మరుగున చాచి ఉంచారని " మా గల్ఫ్ డాట్ కామ్ " కు ఆయన తెలిపారు. మరొక ట్రక్కుకు చెందిన చెక్క బోర్డుల్లో 1.3 మిలియన్ మాదకద్రవ్య మాత్రలు కనుగొన్నారు. అక్రమ రవాణాదారులు ఆ మాదక ద్రవ్యమాత్రలను కార్బన్ కాగితంతో ప్యాక్ చేసి నిఘా అధికారులు ఉపయోగించే పరికరాల ఎక్స్ రే కిరణాలు ధాటి వెళ్లకుండా ఒక రకమైన పొడితో వాటి మధ్య ఖాళీలను నింపారు.మరో సంఘటనలో1.6 మిలియన్ క్యాప్కాగన్ మాత్రలు మరియు దాదాపు 18,000 ట్రాండాల్ మాత్రలు ఒక ట్రక్ నుండి పాలరాయిని తరిగే యంత్రాల మధ్య తరలిస్తూ దొరికిపోయారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







