సినీ నటుడు సంపూర్ణేష్ ను జైలు లో పెట్టిన ఏపీ పోలీసులు
- April 23, 2017
హృదయకాలేయం చిత్రం తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తనను జైలు లో పెట్టిన విషయాన్నీ బయటకు చెప్పాడు. తెలంగాణ సిద్దిపేట ప్రాంతానికి చెందిన సంపూ, ఆంధ్రప్రదేశ్‌కు కేవలం రెండు మూడు సార్లే వెళ్ళాడట..వైజాగ్‌కు హుద్‌హుద్ వచ్చినపుడు ఆర్థిక సాయం చేయడం, అక్కడే జరిగిన ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్ధతు చెప్పడం చూసి అంత పబ్లిసిటీ కోసమే చేసారని అప్పట్లో అంత అనుకున్నారట ..కానీ అది పబ్లిసిటీ కోసం కాదని తెలిపాడు
'హుద్‌హుద్ వచ్చి వెళ్లిన తర్వాత వైజాగ్‌ను చూసి మనసు చలించిపోయింది. అందుకే ఏమీ ఆలోచించకుండా లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటించాను. అయితే ఆ సమయానికి నా వద్ద అంత డబ్బు లేదు. నా స్నేహితుల వద్ద కూడా అంత ఎమౌంట్ లేదు. దాంతో రెండు వారాల టైమ్ తీసుకుని అప్పు చేసి ఆ డబ్బు సీఎంగారికి అందచేశా. అది పబ్లిసిటీ కోసం చేసింది కాదు.
అలాగే ఏపీకి స్పెషల్ స్టేటస్ విషయంలో పవన్‌కల్యాణ్‌గారి స్పీచ్‌ల ద్వారా నేను ఉత్తేజితుడనయ్యాను. అందుకే వైజాగ్ వస్తానని మాటిచ్చాను. ఆ మాటకు కట్టుబడి వైజాగ్ వెళ్లాను. అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో నన్ను అదుపులోకి తీసుకున్నారు. వైజాగ్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న పల్లెటూరిలోని స్టేషన్‌లో నన్ను బంధించారు. నిజానికి ఆ రోజు సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణానికి టికెట్ తీసుకున్నాను. నన్ను ఎప్పుడు విడిచిపెడతారని పోలీస్ వాళ్లను అడిగితే.. 'మాకు తెలీదండి. సీపీగారు మీ మీద కోపంగా ఉన్నార'ని చెప్పాడు. చివరకు సాయంత్రం ఏడు గంటల సమయంలో నన్ను విడిచిపెట్టారు. రాత్రి పది గంటల ఫ్లైట్‌కు హైదరాబాద్ వచ్చానని తెలిపాడు .
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









