భారీ ర్యాలీ చేపడతా : అమెరికాఅధ్యక్షుడు ట్రంప్
- April 23, 2017
100 రోజులు పూర్తయిన సందర్భంగా
వాషింగ్టన్ : ఏప్రిల్ 29 నాటికి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ 100 రోజులు పూర్తిచేసుకోనున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా తన 100వ రోజున భారీ ర్యాలీ చేపడతానని ట్రంప్ అన్నారు. పెన్సిల్వేనియాలో ఈ ర్యాలీ చేపడతానని ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే అదే రోజున శ్వేతసౌధంలో కరెస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ నిర్వహిస్తున్నారు. వైట్‌హౌస్‌లో వార్తలు కవర్ చేసే మీడియా వర్గాల అసోసియేషన్ ఇది. వీరు ఏటా శ్వేతసౌధంలో విందు ఏర్పాటుచేస్తారు. చాలా మంది దేశాధ్యక్షులు ఈ విందుకు హాజరవుతారు. కానీ ట్రంప్ మాత్రం డిన్నర్‌ను మానుకొని పెన్సిల్వేనియాలో ర్యాలీ చేస్తానని ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది. అయితే ఈ ఏడాది శ్వేతసౌధం విందులో తాను పాల్గొనబోనని ట్రంప్ ముందే ప్రకటించారు. తన విషయంలో మీడియా కవరేజ్‌పై అసంతృప్తిగా ఉన్నానని, అందుకు నిరసనగానే తాను ఈ విందుకు హాజరుకావట్లేదని ట్రంప్ చెప్పారు. ట్రంప్‌తో పాటు ఆయన సిబ్బంది కూడా ఈ డిన్నర్‌లో పాల్గొనడం లేదు.
తాజా వార్తలు
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!
- కుటుంబ సభ్యుల పుట్టిన తేదీలతో.. Dh30 మిలియన్ల జాక్‌పాట్ కొట్టిన భారతీయ ప్రవాసి..!!
- కువైట్‌లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో నగదు చెల్లింపులపై కొత్త నిబంధనలు..!!
- సౌదీలో విజిట్ వీసా గడువు దాటితే 50 వేల రియాల్స్ ఫైన్, జైలుశిక్ష..!!
- యూఏఈలో అమెరికా కాన్సులర్ సేవలునిలిపివేత..!!
- రాయల్ హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ కు 25 ఏళ్లు..!!
- హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్‌ప్రెస్‌వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..







