అసలు విషయాన్ని బయటపెట్టిన మంత్రి అఖిలప్రియ నంద్యాల సీటుపై

- April 25, 2017 , by Maagulf
అసలు విషయాన్ని బయటపెట్టిన మంత్రి అఖిలప్రియ నంద్యాల సీటుపై

సీఎం చంద్రబాబునాయుడుతో మాట్లాడాకే నంద్యాల ఉప ఎన్ని కలో పోటీ చేసే అభ్యర్థి పేరు ప్రకటించటం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ అన్నారు. తల్లి శోభానాగిరెడ్డి మూడో వర్ధంతిని పురస్క రించుకొని పట్టణంలోని శోభాఘాట్‌లో తల్లిదండ్రులకు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎంతో రెండు మూడు రోజుల్లో సమావేశమయ్యాక అభ్యర్థి నిర్ణయమవుతుందని తెలిపారు. 
రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి పనులను కర్నూలు జిల్లా నుంచే ప్రారంభిస్తామని తెలిపారు. నంద్యా ల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని పచ్చర్ల గ్రామ గిరిజనులు మంత్రి అఖిలప్రియను కలిసి సమస్యను విన్నవించుకున్నారు. ఈ సమస్య పరిష్కారానికి తానే స్వయంగా మీ వద్దకు వస్తానని గిరిజనులకు హామీ ఇచ్చారు. విలేఖరులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 
ఘనంగా నివాళి..  
శోభానాగిరెడ్డి మూడో వర్ధంతిని పురస్కరించుకొని మంత్రి అఖిలప్రియ, భూమా దంపతుల రెండో కుమార్తె నాగ మౌనిక, కుమారుడు విశ్వ విఖ్యాతరెడ్డి, క ర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డి, మార్కెట్‌యార్డ్‌ చైర్మన్ బీవి రామిరెడ్డి, టీడీపీ నాయకులు మహేశ్వర్‌రెడ్డి, బాచ్చాపురం శేఖర్‌రెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నివాళి అర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com