గడవు తీరిన మందుల పట్టివేత
- April 25, 2017
మస్కట్: 91,551 గడవు తీరిన మెడికల్ సప్లైస్ మరియు ఎక్విప్‌మెంట్‌ని తనిఖీల్లో పట్టుకున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ (పిఎసిపి) వెల్లడించింది. సీబ్ పరిధిలోని ఓ కంపెనీ పరిసరాల్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. పిఎసిపి వెల్లడించిన వివరాల ప్రకారం సదరు కంపెనీ, హాస్పిటల్స్ మరియు హెల్త్ కేర్ సెంటర్లకు మందులు, అవసరమైన పరికరాల్ని సరఫరా చేస్తుంటుంది. అయితే, గడువు తీరిన మందుల్ని, అలాగే నాణ్యత లేని పరికరాల్ని అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, పబ్లిక్ ప్రాసిక్యూషన్ మరియు ఆర్‌ఓపి సంయుక్తంగా ఈ తనిఖీలను నిర్వహించాయి. ఎక్సపైరీ డేట్స్‌ని టాంపరింగ్ చేస్తున్న ఆసియాకి చెందిన కార్మికుల్ని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







