డౌన్టౌన్ దుబాయ్లో పేలుళ్ల వార్తలు అవాస్తవం..
- July 17, 2026
దుబాయ్: డౌన్టౌన్ దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ వెలువడిన వార్తలను దుబాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం (GDMO) ఖండించింది. ఈ మేరకు అంతర్జాతీయ వార్తా సంస్థ రియూటర్స్ ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది.
ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో డౌన్టౌన్ దుబాయ్ ప్రాంతంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు రాయిటర్స్ వార్తా కథనం ప్రచురించింది. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
దీనిపై స్పందించిన దుబాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం, డౌన్టౌన్ దుబాయ్లో ఎలాంటి పేలుళ్ల ఘటన జరగలేదని, రాయిటర్స్ ప్రచురించిన సమాచారం వాస్తవాలకు విరుద్ధమని వెల్లడించింది.
ప్రజలు, మీడియా సంస్థలు అధికారిక వర్గాల నుంచి విడుదలయ్యే సమాచారాన్నే విశ్వసించాలని, ధృవీకరణ లేని వార్తలు, పుకార్లను ప్రచారం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జీడీఎంఓ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







