డ్రగ్స్ బాధితుల కోసం ప్రత్యేక వైద్య విధానాలు
- October 03, 2015
డ్రగ్స్ బాధితుల సంఖ్య పెరిగిపోతుండడంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక నుంచి ప్రైవేటు ఆసుపత్రులు డ్రగ్స్ బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా కొత్త నిబంధనల్ని రూపొందించారు. ఇప్పటికే పలు ప్రైవేటు ఆసుపత్రులు డ్రగ్స్ బాధితులకు చికిత్స అందిస్తున్నా, వాటిల్లో చాలావరకు లైసెన్స్ లేనివే. సమస్య తీవ్రతను తెలుసుకున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ప్రైవేటు ఆసుపత్రులు సమర్థవంతంగా డ్రగ్స్ బాధితులకు సాంత్వన చేకూర్చేలా ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందిస్తామని వెల్లడించింది. 2013 నాటికి సుల్తానేట్‌లో డ్రగ్స్ బాధితుల సంఖ్య 4079గా ఉంది. 2015లో ఈ కేసుల సంఖ్య 5 వేలకు చేరుకోవడంతో యుద్ధ ప్రాతిపదికన డ్రగ్స్ బాధితులకు సేవలందించేందుకు చర్యలు తీసుకోబోతున్నట్లు నేషనల్ కమిషన్ ఆన్ డగ్స్ మరియు సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ ఎఫైర్స్ సెక్రెటరీ డాక్టర్ మొహమ్మద్ జహెర్ అల్ అబ్రి వివరించారు. డ్రగ్స్‌పై నిషేధం ఇంకా కఠినంగా అమలు చేయడం, బాధితులు డ్రగ్స్ వైపు వెళ్ళకుండా చేయడం వంటి ప్రోగ్రామ్స్ కూడా ఈ మిషన్ ద్వారా చేపట్టనున్నారట.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







