పది గ్రాముల పసిడి ధర రూ.26,810కి చేరింది
- October 03, 2015
వరుసగా గత ఐదు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఈ రోజు ఒక్కసారే రూ.660 పెరిగింది. ఈ ఏడాది మొత్తంలో ఒక్క రోజులో ఇంత ఎక్కువ పెరగడం ఇదే మొదటి సారి. ఈ భారీ పెరుగుదలతో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.26,810కి చేరింది. అమెరికా భత్యాలు పెంచడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచనుందన్న వార్తలతో బంగారం ఒక్కసారిగా పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.బంగారం ప్రభావం వెండి ధరపైనా పడింది. ఈ ఒక్కరోజే రూ.1200 పెరగడంతో కేజీ వెండి ధర రూ.35,800కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఈ లోహం ధర సైతం పెరిగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం







