బంగ్లాదేశీయులుకు సౌదీ డెడ్‌లైన్.. 12000 మంది వెనక్కి
- April 26, 2017
దేశంలోని అక్రమ వలసదారులపై సౌదీ అరేబియా ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. జూన్ 30 వరకు అక్రమ వలసదారులు తమ దేశాలకు తిరిగివెళ్లాలని డెడ్‌లైన్ విధించింది. దీంతో సుమారు 12,000 మంది బంగ్లాదేశీ అక్రమ వలసదారులు స్వదేశానికి పయనమయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రియాద్, జెడ్డాలలో ఇప్పటికే 11 వేల మంది బంగ్లాదేశీయులు ఔట్పాస్ను తీసుకున్నారని బంగ్లాదేశ్ ఎంబసీ వెల్లడించింది.
డెడ్‌లైన్ లోగా దేశాన్ని విడిచిపెట్టని వారికి జైలు శిక్షతో పాటు ఫైన్ విధించనున్నట్లు సౌదీ ప్రకటించింది. దీనికోసం కొన్ని కొత్త జైళ్లను సైతం సిద్ధం చేస్తోంది. గడువులోగా 'జనరల్ పార్డన్' కింద వెళ్లే అక్రమ వలసదారులు కావాలంటే చట్టబద్ధంగా తిరిగి దేశంలోకి అడుగుపెట్టడానికి సౌదీ అవకాశం కల్పించింది. వీసా గడువు ముగిసిన తరువాత కూడా దేశంలో ఉంటున్న వారిని టార్గెట్‌గా చేసుకొని చేపడుతున్న డ్రైవ్‌లో.. సుమారు 10 లక్షల మందిని దేశంనుంచి పంపించాలని సౌదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!







