అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- July 17, 2026
నీట్ లో ఆల్ ఇండియా ర్యాంక్ 423 సాధించిన మాస్టర్ జవ్వాజి శివ నిశాంత్‌కు అభినందనలు
విజయవాడ: వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించిన ప్రతిష్ఠాత్మక నీట్–2026 పరీక్షలో విజయవాడ కు చెందిన మాస్టర్ జవ్వాజి శివ నిశాంత్ దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా ర్యాంక్ 423 సాధించి విశిష్ట ప్రతిభను కనబరిచారు.
ఈ అపూర్వ విజయంతో ఆయన తన కుటుంబానికి, గురువులకు, అలాగే రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. క్రమశిక్షణతో కూడిన కృషి, లక్ష్యసాధనపై అంకితభావం, తల్లిదండ్రుల ప్రోత్సాహం మరియు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి అని తెలిపారు. తండ్రి డా. జవ్వాజి సతీష్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. ప్రస్తుతం ఆయన సతీష్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ లో గ్యాస్ట్రోఎంటరాలజీ సేవలు, తల్లి డా. సజ్జ హేమంత లక్ష్మి పీడియాట్రిషియన్ గా సేవలు అందిస్తున్నారు
ఈ సందర్భంగా మాస్టర్ జవ్వాజి శివ నిశాంత్‌కు పలువురు వైద్యులు, విద్యావేత్తలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు శ్రేయోభిలాషులు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







