లారెన్స్‌ మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారు

- April 26, 2017 , by Maagulf
లారెన్స్‌ మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారు

చాలామంది వెండి తెర మీద మాత్రమే హీరో అనిపించుకుంటారు..కానీ నిజ జీవితం లో మాత్రం కొంతమంది మాత్రమే రియల్ హీరోస్ అని ప్రజల చేత పిలిపించుకుంటారు..వారిలో నటుడు & డైరెక్టర్ రాఘవ లారెన్స్ ఒకరు. ఇప్పటికే ఎన్నో సామాజిక సేవలు చేసి ప్రజల చేత శభాష్ అనిపించుకున్న ఇతడు. తాజాగా మరో నలుగురిని దత్తత తీసుకోని తన మంచి మనసును నిరూపించుకున్నాడు.
ఒకే కాన్పులో పుట్టిన నలుగురు పిల్లలను పోషించడానికి కష్టపడుతున్న తల్లిదండ్రులకు బాసటగా నిలిచాడు. చెన్నై మందవెళికి చెందిన శ్రీనివాసన్‌ వెల్డింగ్‌ పనులు చేసుకుంటూ వచ్చే కాస్త డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయన భార్య యద్రికి మూడేళ్ల కిందట ఒకే కాన్పులో నలుగురు పిల్లలు పుట్టారు. ఓ ప్రమాదంలో శ్రీనివాసన్‌ కాలికి పెద్దగాయమవడంతో అప్పటినుంచి కుటుంబ పోషణ కష్టమైంది. ఓ పాత్రికేయుడి ద్వారా విషయం తెలుసుకున్న రాఘవ లారెన్స్‌ ఆ కుటుంబాన్ని సోమవారం తన వద్దకు పిలిపించుకున్నారు. పిల్లల పోషణ, భవిష్యత్తును ఇకపై తానే చూసుకుంటానని భరోసానిచ్చి వారిని దత్తత తీసుకున్నారు. కేవలం వీరు మాత్రమే కాదు ఇప్పటికే రాఘవ లారెన్స్‌ నిర్వహించే ఆశ్రమంలో 60 మంది చిన్నారులున్నారు..
ఓ పక్క సినిమాలు చేస్తూనే ఆలా వచ్చిన డబ్బుతో ఇటువంటి సామాజిక సేవలు చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com