నేటితరం నటీనటులు పై ఆగ్రహం వ్యక్తం చేసిన రిషి కపూర్
- April 28, 2017
అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా అంత్యక్రియలకు నేటితరం నటీనటులు హాజరు కాకపోవడంపై సీనియర్ నటుడు రిషికపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత గొప్ప నటుడికి కనీస గౌరవం ఇవ్వకపోవడం సిగ్గుచేటని రిషికపూర్ ఆవేదన చెందారు. వరుస ట్వీట్లతో నేటి తరం స్టార్లపై మండిపడ్డారు.
గతకొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న వినోద్‌ఖన్నా గురువారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం ముంబయిలో ఖన్నా అంత్యక్రియలు జరిగాయి. రిషికపూర్ సహా బాలీవుడ్ ప్రముఖ నటులు అమితాబ్‌బచ్చన్, అభిషేక్ బచ్చన్, జాకీష్రాఫ్, రణ్‌దీప్ హుడా, చుంకీ పాండే తదితరులు ఖన్నా అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు. అయితే నేటి తరం నటీనటులెవ్వరూ అక్కడ కన్పించకపోవడంపై రిషికపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఈ జనరేషన్‌కు చెందిన ఒక్క నటుడు కూడా అంత్యక్రియలకు రాకపోవడం సిగ్గుచేటు. పైగా వినోద్‌ఖన్నా వారితో కలిసి నటించారు కూడా. పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి’ అని రిషికపూర్ ట్వీట్ చేశారు. ఇక మరో ట్వీట్‌లో.. ‘రేపు నేను చనిపోయినప్పుడు కూడా నన్ను భుజాన మోసేందుకు ఎవరూ ఉండరు. దీనికి నేను ప్రిపేర్ అయి ఉండాలి’ అని బాధపడ్డారు. కాగా.. రిషికపూర్ భార్య నీతూకపూర్, కుమారుడు రణ్‌బీర్ కపూర్ కూడా అంత్యక్రియలకు రాలేదు. దీనిపై కూడా రిషికపూర్ ట్వీట్ చేశారు. ‘నా భార్య, కుమారుడు విదేశాల్లో ఉన్నారు. అందుకే రాలేకపోయారు.’ అని చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







