ప్రమాద కారణం తెలుసుకొనేందుకు ఇక వాహనాలలోను బ్లాక్ బాక్స్ ల ఏర్పాటు
- April 29, 2017
కువైట్ సిటీ: విమానం కూలినప్పుడు ..ఆ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకొనేందుకు ఉపయోగపడే బ్లాక్ బాక్స్ లు ఇక వాహనాలలో దాగి అసలు గుట్టు విప్పనున్నాయి. ప్రమాదవశాత్తు లేదా ట్రాఫిక్ ఉల్లంఘన కారణంగా సంభవించిన ఘటనల నేపథ్యంలో వాస్తవ కారణం గుర్తించడానికి ఇక వాహనాలలోను బ్లాక్ బాక్స్ ల ఏర్పాటు చేయనున్నారు.తీవ్రమైన ప్రమాదాల్లో జరిగినది ఏమిటో తెలుసుకొనేందుకు అన్నిఆధునిక వాహనాల్లో బ్లాక్ బాక్స్ లను ఉపయోగించుకోవచ్చు, వీటి ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు .అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. భద్రతా వనరులు. తీవ్రమైన ప్రమాదాలకు మూలం వెతికేందుకు దోహదపడుతుంది. ముఖ్యంగా బీమా సంస్థలకు ఇది ఎంతో సహాయపడతుంది. బ్లాక్ బాక్స్ ల ఏర్పాటు సంబంధించిన చట్టబద్ధతలను పూర్తి చేసిన తర్వాత వాటిని వాహనాలలో ఏర్పాటు చేసుకొనేందుకు కారు ఏజన్సీలను సంప్రదించవచ్చు, ఇది విమానం ఉపయోగించే ఒకదానితో సమానంగా ఉంటుంది. బ్లాక్ బాక్స్ ఏర్పాటు ద్వారా వాహనాలలో జరిగే అన్ని సంఘటనలు రికార్డు చేస్తుంది.
తాజా వార్తలు
- ఆన్లైన్ కంటెంట్‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
- దుబాయ్ రమదాన్ 2026: పర్యాటకుల కోసం గైడ్
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?









