ఉమ్రా అనుమతులకు ఆదేశించిన మినిస్ట్రీ

- May 01, 2017 , by Maagulf
ఉమ్రా అనుమతులకు ఆదేశించిన మినిస్ట్రీ

మినిస్ట్రీ ఆఫ్‌ హజ్‌ అండ్‌ ఉమ్రా, ఉమ్రా ఆపరేటర్స్‌ అనుమతులు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఉమ్రా కోసం అప్లికేషన్లను తీసుకోవడం, ఉమ్రా నిర్వహించడం కోసం ఎలక్ట్రానిక్‌ పద్ధతుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏజెంట్స్‌తో లింకప్‌ చర్యలు తీసుకోవాలని కోరింది మినిస్ట్రీ. పవిత్ర మక్కా సందర్శన, అలాగే ఉమ్రా కోసం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లింలకు అవకాశం కల్పించే దిశగా ఈ చర్యల్ని విజన్‌ 2030లో భాగంగా చేపడ్తున్నారు. హజ్‌ గవర్నమెంట్‌ సౌదీ అరేబియా వెబ్‌సైట్‌ని సందర్శించి ఉమ్రా ఆపరేటర్లు పర్మిట్స్‌ కోసం అప్లయ్‌ చేసుకోవచ్చు. అప్లికేషన్లను సబ్‌మిట్‌ చేయడానికి ఆఖరు తేదీ మే 29. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com