సరికొత్త ఫీచర్స్ వాట్సాప్‌ లో

- May 02, 2017 , by Maagulf
సరికొత్త ఫీచర్స్ వాట్సాప్‌ లో

సోషల్ మీడియా దిగ్గజం అయినా వాట్సాప్‌..ఇప్పటికే సరికొత్త ఫీచర్స్ తో అందరిని ఆకట్టుకుంటున్న సంగతి తెల్సిందే..తాజాగా మరో సరికొత్త ఫీచర్ ను వినియోగదారులకు అందచబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే లైవ్‌ లొకేషన్‌, ఛేంజ్‌ నంబర్‌ తదితర ఫీచర్లు అందుబాటులో ఉండగా , 'ఫేవరెట్‌ చాట్‌' ఆప్షన్‌ త్వరలోనే అందించబోతుంది.
ఈ ఫీచర్ ద్వారా మనకు ఇష్టమైన వ్యక్తిగత లేదా గ్రూప్‌ చాట్‌ను పిన్‌ చేయడంతో దాన్ని టాప్‌లో ఉంచుకునే అవకాశం కలగనుంది. ఈవిధంగా మూడు ఫేవరెట్‌ చాట్‌లను మాత్రమే పిన్‌ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో టాప్‌ బార్‌లో 'పిన్‌' ఆప్షన్‌ కనిపించనుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ వర్షన్‌ కోసం ప్రయోగదశలో ఉన్న ఈ ఫీచర్‌.. త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశముందని సమాచారం..ఇది కూడా అమల్లోకి వస్తే ఇంకాస్త వినియోగదారులకు పండగే..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com