మే 12న రిలీజ్ కాబోతున్న 'రక్షక భటుడు'
- May 02, 2017
ఈ మధ్య కాలంలో సినిమా ప్రేక్షకులలోకి సరికొత్త పంధాతో దూసుకొచ్చిన కథ అది, ఏ అంచనాలు లేకుండా వచ్చి ఇప్పుడు భారీ అంచనాల నడుమ నిలిచింది. అందుకే విడుదలకు ముందే తెలుగు ప్రేక్షకులు సైతం భారీ స్తాయిలో స్పందిస్తున్నారు. ఆ సినిమా నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టిజర్, ట్రైలర్ ని అత్యద్బుతంగా ఆధరించి మంచి మంచి కథలతో సినిమాలు నిర్మిస్తే మేము విజయాన్ని అందిస్తాం అని తెలుగు చిత్ర సీమకు మరో సారి తెలియజేసారు. అసలు ఇంతకి ఆ కథ ఏంటో, ఆ కథతో తెరకెక్కిన ఆ సినిమా ఏంటో తెలుసా...?
సుఖీభవ మూవీస్ బ్యానర్ పై ఏ గురు రాజ్ నిర్మించి, రక్ష, జక్కన్న ఫేం దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ళ రచించి దర్శకత్వం వహించిన సినిమా ‘’రక్షక భటుడు’’. పోలీస్ ని ఆంజనేయ స్వామి అవతారంలో మోస్ట్ పవర్ ఫుల్ గా చూపించి విడుదల చేసిన ఒక్క పోస్టర్ తోనే సిని ప్రేక్షకుల నుండి తారా స్థాయి అంచనాలను అందుకుంది రక్షక భటుడు టీం. బహుబలిని కట్టప్ప ఏందుకు చంపాడు అన్న స్థాయి లో, పోలీస్ గెటప్ లో నటించిన ఆ స్టార్ హీరో ఏవరు అని ప్రేక్షకులు ఆరా తీయడం మొదలు పెట్టారు అంటే, ఈ సినిమా గురించి సిని మార్కెట్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.
ప్రధాన తారాగణంగా అందాల తార రిచాపనై మరియు (మరో స్టార్ హీరో) నటిస్తుండగా, బ్రహ్మానందం, సుప్రీత్, అదుర్స్ రఘు, చిత్రం శ్రీను, జ్యోతి, ధన్ రాజ్, రాం జగన్, బాహుబలి ప్రభాకర్, బ్రహ్మాజీ, జ్యోతి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి మల్హార్ భట్ట్ కెమెరా మరియు శేఖర్ చంద్ర సంగీతం, అమర్ రెడ్డి ఎడిటింగ్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.
అయితే అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకున్న ఈ రక్షక భటుడు మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్తాయి లో ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ విడుదల కానుంది. దైవానికి దెయ్యానికి మధ్య నడిచే ఒక డిఫెరెంట్ కథగా ఇప్పటికే మనకు కనపడుతుంది, కాగ ఈ సినిమా టీం మాట్లాడుతూ మా సినిమాలో కామెడీ, ఏమోషణ్, యాక్షన్, సెంటిమెంట్, లవ్ ని సమపాళల్లో మేళవించి తెరకెక్కించిన పూర్తీ స్థాయి మాస్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకొచ్చారు. ఆంజనేయ స్వామి పోరాట యోధుడిగా ఎందుకు మారాడు?, అసలు ఆ ఆంజనేయ స్వామి గెటప్ లో ఉన్న స్టార్ హీరో ఏవరు.? ఇంత కొత్తగా తెరకెక్కిన అసలు ఈ సినిమా వెనక దాగిన మెయిన్ కథ ఏంటి అని ప్రేక్షకులలో రేకెత్తిన ప్రతి ప్రశ్న కి మే 12 న విజువల్ గా సమాధానం దొరకనుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









