బహ్రెయిన్ పార్కుల అభివృద్ధికి నిధుల సమస్య
- October 04, 2015
బహ్రెయిన్‌లో పార్కుల అభివృద్ధికి నిధుల సమస్య వెంటాడుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో, ముడిచమురు అమ్మకాలే ప్రధాన ఆదాయం కలిగిన బహ్రెయిన్ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో పార్కుల అభివృద్ధి కోసం కొత్తగా నిధుల కేటాయింపు కష్టమని సదరన్ మున్సిపల్ కౌన్సిల్ ఛైర్మన్ అహ్మద్ అన్సారీ చెప్పారు. 40 పార్క్‌లను అభివృద్ధి చేయాలని గతంలో నిర్ణయించినా, వాటి అభివృద్ధి ఇప్పట్లో జరిగేందుకు పరిస్థితులు ప్రస్తుతం అనుకూలించడంలేదు. బహ్రెయిన్ బడ్జెట్ లోటు 1.5 బిలియన్లకు చేరుకోవడంతో ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ కారణంగానే మాంసంపైనా సబ్సిడీని ఎత్తివేశారు. పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకోవాలని పాలకులు కోరుతున్నారు. అయితే పార్కులు, పర్యాటక ప్రదేశాల్లోని సౌకర్యాల లేమి తమకూ బాధ కలిగిస్తుందని, ప్రైవేటు సంస్థలు ముందుకొస్తే, అభినందిస్తామని అహ్మద్ అన్సారీ చెప్పారు. ఇంకా బడ్జెట్ కేటాయింపులు జరగనందున పార్కుల అభివృద్ధిపై ఆశలు వదిలేసుకోవాల్సిన అవసరం లేదనీ, ఆశించిన స్థాయిలో కాకపోయినా కొంతైనా పార్కుల కోసం నిధులు వస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు అహ్మద్ అన్సారీ.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







