కృష్ణానదిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి
- October 04, 2015
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ప్రధాని నివాసంలో సాయంత్రం 5.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్‌పై నీతి ఆయోగ్ ఉప సంఘం నివేదికను చంద్రబాబు ప్రధానికి అందజేసే అవకాశం ఉంది. అలాగే, ఈనెల 22న ప్రధాని రాష్ట్ర పర్యటన, అమరావతి శంకుస్థాపనపైనా చర్చించనున్నారు. జల మార్గాల అభివృద్ధిపై.. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు స్థానిక విజ్ఞాన్ భవన్లో జరగనున్న సాగరమాల అత్యున్నత కమిటీ భేటీలో చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం 3 గంటలకు ఏపీలో జల మార్గాల అభివృద్ధి, 4వ నెంబరు జాతీయ జలమార్గం కాకినాడ-పుదుచ్చేరి పునర్నిర్మాణం తదితర అంశాలపై ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథార్టీ ఛైర్మన్ అమితాబ్ వర్మ చంద్రబాబుకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అమరావతి నిర్మాణం కృష్ణానది అభిముఖంగా జరగనుండటంతో దాదాపు 30 కిలోమీటర్ల మేర కృష్ణానదిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి యోచిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై సాధ్యాసాధ్యాలను వాటర్‌వేస్ అథార్టీ పరిశీలిస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు







