స్థిరమైన అభివృద్ధి అత్యవసరం- బహ్రెయిన్
- October 04, 2015
ముందు చూపుతో వ్యవహరిస్తే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని బహ్రెయిన్ ప్రధాన మంత్రి ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా చెప్పారు. వరల్డ్ హాబిటాట్ డే సందర్భంగా అంతర్జాతీయ సమాజాన్ని, స్థిరమైన అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారాయన. ఫాస్ట్ ట్రాక్ వృద్ధి, స్థిరమైన లక్ష్యాలతో అభివృద్ధిలో ముందడుగు వేయొచ్చని బహ్రెయిన్ నిరూపించిందని ప్రిన్స్ ఖలీఫా అన్నారు. గత సంవత్సరం ఐక్యరాజ్య సమితి హ్యూమన్ సెటిల్మెంట్స్ ప్రోగ్రామ్ (యూఎన్ హ్యాబిటాట్) అక్టోబర్ మాసాన్ని అర్బన్ మాసంగా ప్రకటించింది. అలాగే అక్టోబర్‌లో తొలి సోమవారాన్ని వరల్డ్ హ్యాబిటాట్ డేగా ప్రకటించింది. అలాగే వరల్డ్ సిటీస్ డే అక్టోబర్ 31గా నిర్వహించబడుతుంది. 'పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఆల్' అని పిలుపునిచ్చిన ఐక్యరాజ్యసమితి నిర్ణయాన్ని ప్రధాని కొనియాడారు. బహ్రెయిన్లోనూ పబ్లిక్ ప్లేసెస్ అందరికీ ఆహ్వానం పలికేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో స్థిరమైన అభివృద్ధి సాధించినందుకు తమకు అవార్డును అంతర్జాతీయ టెలి కమ్యూనికేషన్ యూనియన్, వరల్డ్ హ్యాబిటాట్ డే రోజున రావడం గొప్ప విషయంగా ప్రిన్స్ ఖలీఫా అభివర్ణించారు.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







