టోక్యోలోని విమానంలో దారుణంగా కొట్టుకున్నారు, వీడియో హల్‌చల్
- May 03, 2017
విమానం టేకాఫ్ కావడానికి కొద్ది సమయం ముందు ఇద్దరు ప్రయాణికులు ఒకరిపై మరొకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. ఈ సంఘటన జపాన్ రాజధాని టోక్యోలోని విమానాశ్రయం నుంచి అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌కు వెళ్లాల్సిన ఆల్ నిప్పాన్ ఎయిర్‌వేస్ (ఏఎన్‌ఏ)లో చోటుచేసుకుంది.
మద్యం సేవించిన ఉన్న ఓ అమెరికన్ వ్యక్తి.. మరో ప్రయాణీకుడిపై దాడికి దిగాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కొట్టుకున్నారు. విమానంలోనే దారుణంగా పిడుగుద్దులు కురిపించుకున్నారు.
గొడవపడిన ప్రయాణికుల పేర్లు వెల్లడించేందుకు విమానాశ్రయ అధికారులు నిరాకరించారు. నిన్ను చంపేస్తానంటూ.. నల్ల రంగు టీషర్టు ధరించిన వ్యక్తి ఎరుపు రంగు చొక్కా వ్యక్తిపై పిడిగుద్దులతో దాడి చేశాడు. వారి మధ్య గొడవ ఎందుకు జరిగిందనే విషయం మాత్రం బయటికి రాలేదు.
ఈ తతంగాన్నంతా విమానంలో ఉన్న మరో ప్రయాణికుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్‌గా మారింది. వాళ్లిద్దరి గొడవ వల్ల విమానం దాదాపు గంట పాటు ఆలస్యమైంది. వారిని పోలీసులకు అప్పగించారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్‌వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









