మనోజ్, శింబు జతగా ఓ యాక్షన్ సినిమా
- May 03, 2017
మాజీ ప్రేమికులు శింబు, నయనతార చాలా గ్యాప్ తర్వాత కలసి నటించిన తమిళ చిత్రం ‘ఇదు నమ్మ ఆళ్’. పాండిరాజ్ దర్శకత్వంలో ‘ప్రేమసాగరం’ శింబు సినీ ఆర్ట్స్, జేసన్‌రాజ్ ఫిలింస్ పతాకాలపై టి.రాజేందర్ నిర్మించిన ఈ సినిమా ‘సరసుడు’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. శింబు సోదరుడు టి.ఆర్. కురళ అరసన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. బిగ్ సీడీని హీరో మంచు మనోజ్ ఆవిష్కరించగా, ఆడియో సీడీలను టి.రాజేందర్ రిలీజ్ చేశారు. టి.రాజేందర్ మాట్లాడుతూ– ‘‘1983లో విడుదలైన ‘ప్రేమసాగరం’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. తర్వాత నా చిత్రాలను, నా కొడుకు శింబు చిత్రాలను కూడా పెద్ద హిట్ చేశారు.
ఈ చిత్రం ద్వారా శింబు తన తమ్ముణ్ణి సంగీత దర్శకుణ్ణి చేశాడు. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘నేను, శింబు ప్రాణ స్నేహితులం. నాకు మ్యూజిక్‌లో కొంత టేస్ట్ ఉందంటే కారణం శింబూయే. నేను, శింబు కలిసి ఓ యాక్షన్ సినిమా చేయబోతున్నాం. శింబు కథ తయారు చేస్తున్నాడు’’ అని మంచు మనోజ్ అన్నారు. ‘‘తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులున్నా, మనోజ్ నా ప్రాణ స్నేహితుడు. తెలుగులో నా సినిమా విడుదలై చాలా రోజులైంది. పాండిరాజ్ ఈ సినిమాను చక్కగా తెరకెక్కించారు’’ అన్నారు శింబు. ఈ చిత్రానికి కో–ప్రొడ్యూసర్: శ్రీమతి ఉషా రాజేందర్.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









