పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసు రద్దు
- May 05, 2017
ముంబై, కరాచీల మధ్య నడిచే విమాన సర్వీసులను ఈ నెల 15 నుంచి రద్దు చేయాలని పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ నిర్ణయించింది. కొన్ని నెలలుగా భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు మరింత దెబ్బతినడంతో ఇరు దేశాలు దాదాపుగా వీసాలు మంజూరు చేయడం లేదు. దీంతో ఇరు దేశాల మధ్య ప్రయాణించేవారి సంఖ్య బాగా తగ్గిపోవడంతో పాక్ ఎయిర్‌లైన్స్ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం భారత్‌కు చెందిన ఏ విమాన సంస్థ కూడా పాక్‌కు నేరుగా సర్వీసులు నడపడం లేదు. పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ మాత్రం వారానికి మూడుసార్లు కరాచీ నుంచి ముంబైకి విమానాలను నడుపుతోంది. ఉడీ ఉగ్రవాద దాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించడం, ఆ తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో రాకపోకలు తగ్గాయి. దీని ప్రభావం విమాన రంగంపై పడింది. తాజా పరిణామాల నేపథ్యంలో భారత్-పాక్ మధ్య నేరుగా నడిచే ఒక్క విమాన సర్వీసును కూడా రద్దు చేశారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







