షార్జా సహారా సెంటర్ వద్ద అగ్నిమాపకదళ సిబ్బంది మంటను నింపారు

- May 05, 2017 , by Maagulf
షార్జా సహారా సెంటర్ వద్ద అగ్నిమాపకదళ సిబ్బంది మంటను నింపారు

సహారా సెంటర్లో ఈ రోజు మధ్యాహ్నం ( శుక్రవారం ) ఒక అగ్నిప్రమాదం జరిగింది. ఆ అగ్నిని 10 నిమిషాలలో అదుపులో ఉంచారు ఇది ఒక చిన్న అగ్ని ప్రమాదం ఐనప్పటికీ ఈ సెంటర్ ఖాళీ చేయడానికి వీలు లేని పరిస్థితి అక్కడ ఉంది.వేగంగా అలుముకొంటున్న పొగ కారణంగా భద్రత కల్పించటానికి ప్రభావితమైన ప్రాంగణాలు మరియు పొరుగు దుకాణాలను ఖాళీ చేయమని అగ్నిమాపక అధికారులు కోరారు.షార్జా సివిల్ డిప్యూటీ డైరెక్టర్ లెఫ్టినెంట్-కల్నల్ సాల్ అల్ నక్బి ఈ సందర్భంగా మాట్లాడుతూ , "ఇది ఒక చిన్న అగ్ని ప్రమాదమని ఇక్కడ  ఎటువంటి మరణాల సంఖ్యనమోదు కాలేదని వివరించారు.  సివిల్ డిఫెన్స్ ఆపరేషన్ రూమ్ కు అగ్ని ప్రమాదం గూర్చి ఈ రోజు మధ్యాహ్నం 1.00 గంటలకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే అగ్నిమాపక దళ జట్టుని పారిశ్రామిక ప్రాంతంకు పంపడం జరిగింది. ఆ ప్రదేశంలో వంట గదిలోని  ఓవెన్ మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఆ మంటలను 10 నిమిషాలలో తమ సిబ్బంది అదుపు చేసినట్లు ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com