ఇండోనేషియా లో 200 మంది ఖైదీలు పరారు
- May 05, 2017
జైలులో శిక్ష అనుభిస్తున్న ఖైదీలు సందు దొరికితే చాలు పారిపోదామని చూస్తారు. అదే వందల్లో ఖైదీలు ఉండి, పదిమంది లోపే పోలీసులు ఉంటే ఏమౌతుంది. సందు దొరికిందని పారిపోతారు. సరిగ్గా అలాంటి సంఘటనే సుమాత్రా దీవుల్లోజరిగింది. సుమాత్రా దీవిలోని సియాలంగ్ బంగ్‌కుక్ అనే ఓ కిక్కిరిసిన జైలు నుంచి సుమారు 200 మంది ఖైదీలు తప్పించుకుపోయారు. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా వారంతా ఒక్కసారిగా బయటకు వచ్చారు.
అయితే, కాపలాగా ఆరుగురు సిబ్బంది ఉండటంతో వారి పని సులువైంది. గార్డులను పక్కకు నెట్టేసి ఖైదీలంతా తలోదిక్కు పారిపోయారు. సమాచారం అందుకున్న యంత్రాంగం అప్రమత్తమయింది. పోలీసులతోపాటు సైన్యాన్ని రంగంలోకి దించింది. అన్ని రోడ్లను దిగ్బంధించి సోదాలు చేపట్టారు. పరారైన ఖైదీల సంఖ్యపై అధికారులు స్పష్టత ఇవ్వటం లేదు. అయితే, సుమారు 300 మంది ఉంటారని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ జైలులో సామర్ధ్యానికి మించి మూడు రెట్లు అదనంగా, దాదాపు 1,800 మంది ఖైదీలున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







