జూన్ 2 న విడుదల కానున్న 'ఫ్యాషన్ డిజైనర్'

- May 06, 2017 , by Maagulf
జూన్ 2 న విడుదల కానున్న 'ఫ్యాషన్ డిజైనర్'

ప్రముఖ దర్శకుడు వంశీ సినిమాల్లోని గోదావరి అందాలు, ఆ గోదావరి అందాలతో పోటీ పడే హీరోయిన్ల అందాలు, సంభాషణలు, సంగీతం, చిత్రీకరణ ఇలా అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి మేటి దర్శకుడు వంశీ దర్శకత్వంలో వచ్చిన అలనాటి మేటి చిత్రం 'లేడీస్‌ టైలర్‌' అప్పట్లో విశేష ప్రజాదరణ పొందిన సంగతి తెల్సిందే..రాజేంద్రప్రసాద్‌ హీరోగా నటించిన ఆ చిత్రాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు.. ఆ పాత మధురం 'లేడీస్‌ టైలర్‌' సినిమాకి సీక్వెల్‌ 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' చిత్రాన్ని తెరకెక్కించారు.
ఇటీవలే రిలీజైన ఈ చిత్రం యొక్క పోస్టర్లకు, పాటలకు మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ సినిమాను జూన్ 2వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కొద్దిసేపటి క్రితమే ఈ తేదీని అధికారికంగా అనౌన్స్ చేశారు. ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com