భర్త పై కోపంతో భార్య ఏమి చేసిందో తెలుసా?

- May 06, 2017 , by Maagulf
భర్త పై కోపంతో  భార్య ఏమి చేసిందో తెలుసా?

కొలంబియాలో ఓ మహిళ భర్త మీద కోపంతో ప్రాణాల మీదకు తెచ్చుకునే పని చేసింది. భార్యభర్తల అన్నక చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం. కానీ ఆ కోపం ఎటు దారితీస్తుందని అని మాత్రం చెప్పాలేం. ఓ 30 ఏళ్ల మహిళ భర్త మీద కోపంతో దాచుకున్న డబ్బుంతా మింగేసింది. వెంటనే అస్వ‌స్థ‌త‌కు గుర‌ైన ఆమెను హాస్పటల్ కి తీసుకెళ్లగా ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డింది. 
కొలంబియాకు చెందిన ఓ 30 ఏళ్ల మహిళ త‌న భ‌ర్త‌తో టూర్ కి వెళ్లాల‌ని, డ‌బ్బుని దాచుకుంది. ఐతే, ఇటీవ‌ల త‌న భ‌ర్త‌తో ఆమెకు గొడ‌వ చెల‌రేగింది. దీంతో ఆమె విజిటింగ్ టూర్ ను ప్లానింగ్ ను క్యాన్సెల్ చేసుకుంది. తాను దాచుకున్న డ‌బ్బు త‌న‌ భర్తకు దొరక్కుండా చేయాలని 9 వేల డాలర్లను న‌మిలి మింగేసింది. ఆమె క‌డుపులోంచి 57 వంద డాలర్ల నోట్లను బయటకు తీశామని, ఆమె కోలుకుంటోంద‌ని ఆమెకు ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్లు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com