ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వర్ష సూచన

- May 08, 2017 , by Maagulf
ఏపీ, తెలంగాణ   రాష్ట్రాలకు వర్ష సూచన

తెలుగు రాష్ట్రాలకు రానున్న 48 గంటల్లో పలు చోట్ల ఉరుములు, తీవ్రగాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని విశాఖ వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర కర్ణాటక నుంచి మధ్యప్రదేశ్‌, విదర్భ, మహారాష్ట్ర వరకూ ద్రోణి ఏర్పడిందని...దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా మరో 4 రోజుల పాటు వర్ష సూచన ఉందని తెలిపారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 5 సెం.మీ, విజయనగరంలో 3 సెం.మీ, డెంకాడ, వేపడ, పూసపాటిరేగ, తెర్లాంలో 2 సెం.మీ, విశాఖలో 3 సెం.మీ, అనంతపురం జిల్లా పెనుగొండలో 3 సెం.మీ, లేపాక్షిలో 2 సెం.మీ, కర్నూలు జిల్లా హోళగుందలో 2 సెం.మీ వర్షపాతం నమోదైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com