పసిడి ధర నెమ్మదిగా దిగి వస్తోంది

- May 08, 2017 , by Maagulf
పసిడి ధర నెమ్మదిగా దిగి వస్తోంది

గత కొంతకాలంగా పెరుగుతూ వెళ్లిన బంగారం ధర నెమ్మదిగా దిగి వస్తోంది. వరుసగా ఏడో రోజూ బంగారం ధర తగ్గడం విశేషం. సోమవారం నాటి బులియన్‌ ట్రేడింగ్‌లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.175 తగ్గి రూ.28,550కి చేరింది. స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్‌ లేకపోవడం, అంతర్జాతీయంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడటం బంగారం ధర తగ్గుదలకు కారణమని ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి.
మరోపక్క పసిడి బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండి రూ.225 తగ్గి రూ.38,350కి చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి ఆర్డర్లు లేకపోవడం వల్లే వెండి ధర తగ్గింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com