కేవలం రూ.899కే ఇండిగో విమాన టికెట్
- May 08, 2017
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ‘సమ్మర్ స్పెషల్ సేల్’ ఆఫర్‌ను ప్రకటించింది. దేశీయంగా నడిచే ఇండిగో విమానాల్లో ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ప్రారంభ ధర రూ.899లకే టికెట్ పొందవచ్చు. మే 8 నుంచి మే 10వ తేదీ వరకూ ఎంపిక చేసిన మార్గాల్లో టికెట్లు బుక్‌చేసుకోవచ్చని ఇండిగో తెలిపింది. ముంబయి-గోవా, అహ్మదాబాద్- ముంబయి, చెన్నై-పోర్ట్ బ్లెయిర్, గువహటి- హైదరాబాద్, ముంబయి-గువహటి, జమ్మూ-అమృత్‌సర్, దిల్లీ-ఉదయ్‌పూర్, కోల్‌కతా-అగర్తలా తదితర రూట్లలో ఇండిగో ఈ సదుపాయాన్ని కల్పించింది. టికెట్లు బుక్ చేసుకున్న వారు జూన్ 1 నుంచి ఆగస్టు 31వ తేదీ మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది.
ఇక చెన్నై నుంచి 14 మార్గాలకు ప్రత్యేక ధరలను కూడా ప్రకటించింది. వీటిలో హైదరాబాద్‌కు రూ.1,399, విశాఖపట్నానికి రూ.1,099లకే టికెట్ అందించనుంది.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







