దిల్ రాజు బ్యానర్ లో రానున్న చరణ్ నెక్స్ట్ సినిమా
- May 08, 2017
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ గ్రామీణ నేపద్య ప్రేమ కథ సినిమాను చేస్తున్న సంగతి విధితమే.. ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నది.. కాగా చరణ్ నెక్స్ట్ సినిమాపై రకరకాల వినిపిస్తున్నాయి. చరణ్ నెక్స్ట్ సినిమా మణిరత్నం దర్శకత్వంలో అనే టాక్ వినిపించినా ప్రస్తుతం ఆ ప్రయత్నాలకు అడ్డుకట్టపడ్డట్లు తెలుస్తోంది. కాగా తాజాగా దిల్ రాజు తన నిర్మాణ సంస్థలో ఓ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టాక్.. చరణ్, దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన "ఎవడు" సినిమా సూపర్ హిట్ తో పాటు చరణ్ కు మంచి పేరు ని కూడా తెచ్చింది. ఓ వైపు చిన్న సినిమాలను నిర్మిస్తూనే దిల్ రాజు భారీ బడ్జెస్ట్ సినిమాలను కూడా చేస్తున్నాడు. చరణ్ తో భారీ బడ్జెట్ తో సినిమా చెయ్యడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు.. ఈ విషయం పై స్టోరీ రెడీ చెయ్యమని ఓ స్టార్ దర్శకుడికి చెప్పినట్లు తెలుస్తోంది. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండేలా స్టోరీ రెడీ చేయమని ఆ స్టార్ హీరోకి దిల్ రాజు చెప్పాడట... అన్నీ రెడీ అయితే.. చరణ్ నెక్స్ట్ మూవీ దిల్ రాజు బ్యానర్ లోనే ఉండనున్నదట..
తాజా వార్తలు
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్









