డి పి వరల్డ్ 10 మంది ప్రమాదంలో గాయపడిన ' సంఘటన ' ధ్రువీకరించారు
- May 08, 2017
జబెల్ అలీ పోర్ట్ : మే నెల 4 వ తేదీ గురువారం జబెల్ అలీ పోర్ట్ వద్ద జరిగిన సంఘటనను డి పి వరల్డ్ ధ్రువీకరించింది. ఆ ప్రమాదం టెర్మినల్ 1 వద్ద జరగ్గా ఫలితంగా 10 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఏ విధమైన మరణాలు నమోదు కాలేదు. ఒక కంటైనర్ పాత్ర నౌకాశ్రయం గోడతో డీకొట్టడంతో ఈ సంఘటన సంభవించింది. గోడను పడగొట్టిన క్రేన్ సైతం వాలిపోయింది, అదే సమయంలో రెండవ క్రేన్ ని ఒక దానితో ఒకటి గుద్దుకోవడం జరిగింది.' తీవ్ర స్థాయి ' నుండి ' స్వల్ప స్థాయిలో ' వరకు వ్యాప్తి చెందిందని డి పి వరల్డ్ పేర్కొంది, తొమ్మిది మంది కార్మికులకు ప్రమాద స్థలంలోనే వైద్య చికిత్సను నిర్వహించారు. ఈ ఘటనలో ఒక కార్మికుని చేయి మరియు కాలు విరగడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన ప్రస్తుతం దర్యాప్తులో ఉంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..







