అల్‌ కబాన్‌ ఫ్యామిలీ పార్క్‌ ప్రారంభం

- May 09, 2017 , by Maagulf
అల్‌ కబాన్‌ ఫ్యామిలీ పార్క్‌ ప్రారంభం

అల్‌ ఖోర్‌ మరియు అల్‌ థకిరా మునిసిపాలిటీ, అల్‌ కబాన్‌ పార్క్‌ని అల్‌ కబాన్‌ సిటీలో సోమవారం ప్రారంభించింది. ఈ ఫ్యామిలీ పార్క్‌, 10,693 చదరపు మీటర్ల వైశాల్యంలో ఏర్పాటయ్యింది. పిల్లల కోసం పూర్తి భద్రతతో కూడిన రబ్బరైజ్డ్‌ గ్రౌండ్స్‌తో ఏర్పాటు చేశారు. సందర్శకులు కూర్చునేందుకు సీట్లు, వాటర్‌ ఫౌంటెయిన్‌, వాటర్‌ డక్ట్‌, స్పోర్ట్‌ ఎక్విప్‌మెంట్‌, వాకింగ్‌ కారిడార్స్‌, మోడర్న్‌ టాయిలెట్స్‌ వంటివి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పలు రకాలైన మొక్కలతో పార్క్‌ని పచ్చదనంతో నింపేశారు. పార్క్‌లో సర్వైలెన్స్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే వైఫై కనెక్షన్‌ని సందర్శకుల కోసం ఇన్‌స్టాల్‌ చేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com