బ్రిటన్‌తో బహ్రెయిన్ సంబంధాలు బలోపేతం
- October 05, 2015
ప్రధాన మంత్రి ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, బహ్రెయిన్‌తో కలిసి ఉగ్రవాదంపై పోరులో ముందుకు నడవాలనుకుంటున్న యునైటెడ్ కింగ్డమ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ళలో ఉగ్రవాదం ముఖ్యమైనదనీ, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు అత్యవసరమని ప్రిన్స్ ఖలీఫా అన్నారు. కొత్తగా నియమితులైన బ్రిటిష్ అంబాసిడర్ సిమన్ మార్టిన్‌తో ప్రిన్స్ ఖలీఫా సమావేశమయ్యారు. బ్రిటన్ నుంచి ఏ సహాయం అవసరమైనా బహ్రెయిన్‌కి అందిస్తామని మార్టిన్ చెప్పినట్లు ప్రిన్స్ ఖలీఫా వెల్లడించారు. అలాగే, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విభాగంలో స్థిరమైన వృద్ధి సాధించి అవార్డును సొంతం చేసుకున్న బహ్రెయిన్‌కి బ్రిటన్ అంబాసిడర్ శుభాకాంక్షలు తెలిపారు. యూకే (బ్రిటన్) అంబాసిడర్, తీవ్రవాదంపై బహ్రెయిన్ జరుపుతోన్న పోరాటాన్ని కూడా అభినందించారు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!







